
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO) నిర్మాణానికి నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం ప్రాంతంలో శంకుస్థాపన జరగనుంది. జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.
ఉదయం 8 గంటలకు ఎంపీ పురందేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాప్రతినిధులు, విమానయాన రంగ నిపుణులు పాల్గొననున్నారు. సుమారు రూ.100 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయనుండగా, ఇది రాష్ట్రంలో విమానయాన శిక్షణ రంగానికి కొత్త దిశ చూపనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!