

కేంద్ర మాజీ మంత్రి M. K. Alagiri కుమార్తె కయల్‌విళి చెన్నై అడయారులోని ఎస్‌బీఐ శాఖ మేనేజర్ హర్షిన్ సింగ్‌పై చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కయల్‌విళికి చెందిన భవనంలో ఉన్న బ్యాంకు శాఖలో లిఫ్ట్ పనిచేయకపోవడంతో మేనేజర్ ఆమె అసిస్టెంట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అటువైపు నుంచి స్పందన రాకపోవడంతో లిఫ్ట్ సమస్య గురించి చెప్పేందుకు కయల్‌విళికి నేరుగా ఫోన్ చేశారు. అనంతరం బ్యాంకుకు వచ్చిన ఆమె తనకు నేరుగా ఫోన్ చేయడంపై మేనేజర్‌ను ఆగ్రహంగా ప్రశ్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో మేనేజర్ హర్షిన్ సింగ్ కూర్చొని ఉండగా కయల్‌విళి ఆయన చెంపపై కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం. ఘటనపై బ్యాంకు చీఫ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులోని అంశాలతో పాటు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!