

ఉత్తర్ ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2026 వేదికగా యూపీ పారిశ్రామికాభివృద్ధికి కీలక ముందడుగు పడింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో వివిధ రంగాలకు చెందిన ఐదు ప్రముఖ సంస్థలకు పారిశ్రామిక ప్రాజెక్టుల ఏర్పాటుకు స్థల కేటాయింపు పత్రాలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అందించారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.469 కోట్లుగా ఉంది.
కేటాయింపు పత్రాల అందజేత అనంతరం పారిశ్రామికవేత్తలతో అమిత్ షా ముఖాముఖి మాట్లాడారు. ఉత్తర్ ప్రదేశ్‌లో పారిశ్రామిక రంగాన్ని వేగవంతం చేయడం, స్థానిక తయారీ సామర్థ్యాన్ని పెంచడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంపై చర్చించారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ఉత్పత్తి దశకు చేరుకునేలా పనులను వేగవంతం చేయాలని పారిశ్రామికవేత్తలను కోరారు. భూమి కేటాయింపు పొందిన సంస్థల్లో సీ అండ్ ఆర్ టెక్స్‌టైల్స్, పర్ఫెక్ట్‌ప్యాక్ లిమిటెడ్, ఎస్‌ఏబీఎస్ ఎక్స్‌పోర్ట్స్ ఇంటర్నేషనల్, సింప్లాస్ట్ ఇండియా, సాహు ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!