

హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2026లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ పేర్లు ప్రత్యేకంగా నిలిచాయి. షారుఖ్ ఖాన్ రూ.10 వేల కోట్ల నికర ఆస్తులతో అత్యంత ధనిక భారతీయ నటుడిగా నిలిచారు. ఇక షారుఖ్ నటించిన ‘స్వదేశ్’లో హీరోయిన్‌గా నటించిన గాయత్రి ఒబెరాయ్ భర్త వికాస్ ఒబెరాయ్ నికర ఆస్తులు రూ.48,100 కోట్లుగా హరూన్ ఇండియా వెల్లడించింది. ఈ జాబితాలో వికాస్ 59వ స్థానంలో ఉన్నారు. గతేడాది ఆయన రూ.42,960 కోట్ల ఆస్తులతో 58వ స్థానంలో ఉన్నారు.
గాయత్రి ఒబెరాయ్ 2004లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వదేశ్’ చిత్రంతో షారుఖ్ ఖాన్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ చిత్రం ఆమె నటించిన ఏకైక సినిమా. 2005లో వికాస్ ఒబెరాయ్‌ను వివాహం చేసుకున్న అనంతరం ఆమె సినీ పరిశ్రమకు దూరమయ్యారు. అంతకుముందు గాయత్రి టీవీ వ్యాఖ్యాతగా పనిచేయడంతో పాటు ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొన్నారు. 2000లో మిస్ ఇంటర్నేషనల్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!