
జనరల్

కేపీహెచ్‌బీలోని లులు మాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘మిక్చర్‌లో బల్లి కనిపించింది’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల నేపథ్యంలో అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టారు. మాల్లోని ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలు, నిల్వ విభాగాలను పరిశీలించారు.
తనిఖీల సమయంలో పలు ఆహార పదార్థాలలో పురుగులు, పరిశుభ్రత లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనతో వినియోగదారుల్లో ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. తనిఖీ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!