

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాలేజీ ప్రవేశాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఫీజుల చెల్లింపులపై గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం నిబంధనలు ఒకవైపు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల కోర్టు పిటిషన్లు మరోవైపు ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, డిగ్రీ, పీజీ వంటి కోర్సులు చదివే సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏటా దాదాపు 2,500 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ, గత కొన్నేళ్ల బకాయిలు కలిపి సుమారు 8,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రైవేటు కాలేజీలు దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో అనిశ్చితి ఏర్పడింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంపై గతంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కూడా అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!