
సినిమాలు

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ కమిషన్ పంట మార్పిడి విధానాలపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి సమర్పించింది. కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి నేతృత్వంలో సభ్యులు జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రిని కలిసి ఈ నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా రైతుల్లో పంట మార్పిడి పట్ల అవగాహన పెంపొందించడం, లాభదాయక వ్యవసాయ విధానాలపై సమగ్ర చర్చ అవసరమని ముఖ్యమంత్రి తెలిపారు.
పంట మార్పిడిపై శాసనసభలో ప్రత్యేక చర్చ నిర్వహించి అందరి అభిప్రాయాలను సేకరిస్తామని ఆయన వెల్లడించారు. మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కమిషన్‌ను కోరారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి గారు, సభ్యులు రాములు నాయక్, సునీల్, రాంగోపాల్ రెడ్డి, జి. గంగాధర్, కేవీ నర్సింహా రెడ్డి, సీహెచ్ వెంకన్న యాదవ్, ఎం. భవాని పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!