
జనరల్

హైదరాబాద్ సిటీ పోలీస్ నియామకాల పేరుతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మోసం చేసేందుకు ఈ తప్పుడు ప్రకటనలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ధృవీకరణ లేకుండా వచ్చే ఉద్యోగ ప్రకటనలను నమ్మొద్దని, డబ్బులు చెల్లించవద్దని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. అధికారిక నియామక ప్రకటనలు ప్రభుత్వ అధికారిక మార్గాల్లో మాత్రమే విడుదలవుతాయని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!