

బాలీవుడ్ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ మరో కీలక ఘనత సాధించింది. 99వ అకాడమీ అవార్డుల విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాప్ 20 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. వెరైటీ కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకోవడంతో సినిమా తదుపరి దశ ఓటింగ్‌కు అర్హత సాధించింది. హాలీవుడ్ భారీ చిత్రాలైన ‘డ్యూన్: పార్ట్ త్రీ’, ‘ది ఒడిస్సీ’, ‘అవెంజర్స్: డూమ్స్‌డే’, ‘ప్రాజెక్ట్ హేల్ మేరీ’ వంటి సినిమాలతో కలిసి ‘రామాయణం’ ఈ జాబితాలో నిలిచింది. తుది నామినేషన్లలోనూ చోటు దక్కించుకుంటే భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఇది గొప్ప విజయంగా నిలవనుంది.
గతంలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ కూడా ఆస్కార్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో టాప్ 20 జాబితాలో చోటు సంపాదించుకుంది. అయితే తుది నామినేషన్ల వరకు వెళ్లలేకపోయింది. మొదటి నుంచీ భారీ విజువల్ స్పెక్టకిల్‌గా ప్రచారం పొందుతున్న ‘రామాయణం’ ఆస్కార్ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో భారీ చిత్రాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో.. తదుపరి దశల్లో ఈ సినిమా ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. తుది నామినేషన్లలో చోటు దక్కించుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు మరో గుర్తింపు లభించినట్లే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!