
సినిమాలు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఓ మెన్స్ పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా హాస్టల్‌లో ఉంటున్న ఎనిమిది మందికి డ్రగ్ టెస్టులు చేయగా, ఆరుగురికి గంజాయి పాజిటివ్‌గా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పాజిటివ్‌గా తేలిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం.
హాస్టళ్లలో గంజాయి వినియోగాన్ని అరికట్టడంపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐటీ ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్‌లో ఉన్న పీజీ హాస్టళ్లపై నిఘా పెంచింది. కొన్ని హాస్టళ్లలో డ్రగ్ పెడ్లర్లు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించడంతో తనిఖీలను ముమ్మరం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!