2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Writer: Shivani K 06:00 AM, 2 నవంబర్, 2026
రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఎలాంటి గుర్తింపు ఉందో, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌కు అలాంటి ప్రత్యేక గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నరెడ్కో (నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌) ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను భూకబ్జాలు, ల్యాండ్‌ మాఫియా సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దాలని సూచించారు. అభివృద్ధి కోసం భూములు కొనుగోలు చేసిన తర్వాత కోర్టు వివాదాల కారణంగా బిల్డర్లు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, న్యాయస్థానాలు, నరెడ్కో సమన్వయంతో ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరించాలని, చిన్న సంస్థలను ప్రోత్సహించి కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచే బాధ్యతను నరెడ్కో తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మందికి ప్రయోజనం చేకూర్చే రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే రియల్‌ ఎస్టేట్‌ రంగం మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని, హైదరాబాద్‌ అనుసంధానతను పెంచేందుకు మూడు ప్రధాన బుల్లెట్‌ రైలు కారిడార్లకు సంబంధించిన ప్రాథమిక పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనుల విషయంలోనూ కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. అనంతరం ప్రాపర్టీ షోలో ఉత్తమ స్టాల్స్‌ ఏర్పాటు చేసిన సంస్థలకు కిషన్‌రెడ్డి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో నెక్ట్స్‌ జెన్‌ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు కె.శ్రీధర్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ ఆర్‌.వెంకటేశ్వరరావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!

పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..

పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చనున్న TGSRTC..

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..

రెండు నెలల పసికందుతో పోలింగ్‌ కేంద్రానికి మహిళ..

ట్యాగ్లు
కిషన్‌రెడ్డిహైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌నరెడ్కోప్రాపర్టీ షోరీజినల్‌ రింగ్‌ రోడ్డుబుల్లెట్‌ రైలు కారిడార్లుహైదరాబాద్‌ మెట్రోమౌలిక సదుపాయాలుభూకబ్జాలుతెలంగాణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌
రాజకీయాలు

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌
రాజకీయాలు

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు
రాజకీయాలు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?
జనరల్

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!
రాజకీయాలు

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌
సినిమాలు

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
జనరల్

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!
జనరల్

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!
జనరల్

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!

బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. ఝాన్సీ, రోహిత్ అవుట్.. త్రిగుణ్ వీడియోతో మారిన ఓట్లు!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. ఝాన్సీ, రోహిత్ అవుట్.. త్రిగుణ్ వీడియోతో మారిన ఓట్లు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!