
జనరల్

యూరప్‌ను తీవ్ర హీట్‌వేవ్ అతలాకుతలం చేస్తోంది. 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జర్మనీ, ఫ్రాన్స్‌తో పాటు పలు దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారగా, ఎండల ప్రభావంతో ఇప్పటికే 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రభుత్వాలు అప్రమత్తమై ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నాయి.
తీవ్ర వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు షాపింగ్ మాల్స్, చల్లని ప్రదేశాలకు తరలిపోతున్నారు. కొన్ని నగరాల్లో అధికారులు ఫైరింజిన్ల ద్వారా వీధులపై, ప్రజలపై నీటిని చల్లుతూ ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో యూరప్‌లో హీట్‌వేవ్ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!