
సినిమాలు

దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచారు. జూన్ 7, 2026 నుంచి 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌పై రూ.29 పెంపు అమల్లోకి వచ్చింది. ఈ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై మరోసారి అదనపు భారం పడింది. ఇటీవలే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఇది మరింత ఆర్థిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది.
తాజా పెంపుతో హైదరాబాద్ మార్కెట్‌లో 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.965 నుంచి రూ.994కు చేరింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. దేశంలోని ఇతర నగరాల్లో కూడా స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!