30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి- మంత్రి దామోదర్

Writer: Shivani K 11:10 PM, 29 అక్టోబర్, 2026
నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి- మంత్రి దామోదర్

నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుతో పాటు హైదరాబాద్‌లోని గోషామహల్‌లో నిర్మిస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ రెండు కీలక ప్రాజెక్టుల పురోగతిపై గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతి, తదుపరి దశలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు. గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణం 23 శాతం పూర్తయిందని, నిమ్స్ విస్తరణ ప్రాజెక్టులో భవన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.

ప్రభుత్వ వైద్య సేవలను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్. చొంగ్తు, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, వైద్య విద్య సంచాలకురాలు డాక్టర్ వాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటర్ల నమోదు గడువు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం

ఇజ్రాయెల్ ఎన్నికల్లో జోక్యం ఆరోపణలు.. ఖతార్ తీవ్ర ఖండన

అమెరికాలో హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో మార్పులు.. భారతీయులపై ప్రభావం

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. ప్రపంచ పెట్టుబడిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం

ఐఎస్ఎం 2.0లో తెలంగాణకు చోటివ్వండి.. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

ఏపీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఊరట.. ఓటీపీ లేకుండానే డెలివరీకి అనుమతి

ట్యాగ్లు
తెలంగాణదామోదర్ రాజనర్సింహనిమ్స్ విస్తరణ ప్రాజెక్టుఉస్మానియా జనరల్ హాస్పిటల్గోషామహల్వైద్య మౌలిక సదుపాయాలుఆరోగ్యశాఖఆస్పత్రి నిర్మాణంప్రభుత్వ వైద్య సేవలుహైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటర్ల నమోదు గడువు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం
జనరల్

ఓటర్ల నమోదు గడువు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం

ఇజ్రాయెల్ ఎన్నికల్లో జోక్యం ఆరోపణలు.. ఖతార్ తీవ్ర ఖండన
జనరల్

ఇజ్రాయెల్ ఎన్నికల్లో జోక్యం ఆరోపణలు.. ఖతార్ తీవ్ర ఖండన

జవహర్ నగర్ డంప్ యార్డు తొలగింపునకు డీపీఆర్ సిద్ధం చేయండి: ఈటల రాజేందర్
రాజకీయాలు

జవహర్ నగర్ డంప్ యార్డు తొలగింపునకు డీపీఆర్ సిద్ధం చేయండి: ఈటల రాజేందర్

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి- మంత్రి దామోదర్
జనరల్

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి- మంత్రి దామోదర్

అమెరికాలో హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో మార్పులు.. భారతీయులపై ప్రభావం
జనరల్

అమెరికాలో హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో మార్పులు.. భారతీయులపై ప్రభావం

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. ప్రపంచ పెట్టుబడిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. ప్రపంచ పెట్టుబడిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం

ఐఎస్ఎం 2.0లో తెలంగాణకు చోటివ్వండి.. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
జనరల్

ఐఎస్ఎం 2.0లో తెలంగాణకు చోటివ్వండి.. కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

ఏపీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఊరట.. ఓటీపీ లేకుండానే డెలివరీకి అనుమతి
జనరల్

ఏపీలో గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఊరట.. ఓటీపీ లేకుండానే డెలివరీకి అనుమతి

పశ్చిమ బెంగాల్‌లో గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలి.. సుప్రీంకోర్టుకు అభిషేక్ బెనర్జీ విజ్ఞప్తి

మంజీరా నీటి కొరతతో బీర్‌ తయారీ సంస్థల్లో కలవరం.. భూగర్భ జలాలపై ఆధారం

మియాపూర్ భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చారిత్రాత్మక విజయం

రాజేష్ ఖన్నా 'జీవిత భాగస్వామి' గుర్తింపు వివాదంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
గాసిప్స్

రాజేష్ ఖన్నా 'జీవిత భాగస్వామి' గుర్తింపు వివాదంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!