

మంత్రి కొండా సురేఖ, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సంబంధించిన వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కీలక నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమర్పించింది. కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులు కలిసి ఈ నివేదికను అందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసినట్లు మల్లు రవి తెలిపారు. అలాగే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి, చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడించారు.
గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మల్లు రవి.. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలను కమిటీ పరిశీలించిందని తెలిపారు. వారు మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలించి, వాటి ఆధారంగా సమగ్ర నివేదిక రూపొందించినట్లు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నివేదికను ఏఐసీసీకి అందజేస్తారని వెల్లడించారు. పార్టీ లైన్ దాటిన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరినట్లు మల్లు రవి స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!