
సినిమాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ తమ విజయాన్ని సీఎంతో పంచుకున్నారు.
ప్రపంచ వేదికపై భారత్‌కు గుర్తింపు తీసుకొచ్చిన ఇద్దరు క్రీడాకారిణులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వారి భవిష్యత్ క్రీడా ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.వి. లక్ష్మి పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!