
జనరల్

హీరోయిన్ కాయదు లోహర్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో ఊహించని విధంగా విమాన ప్రయాణంలో పక్కపక్కనే కూర్చునే అవకాశం లభించింది. రజినీకాంత్‌కు తాను వీరాభిమానినని చెప్పుకున్న కాయదు లోహర్, ఆయన పక్కన కూర్చున్న క్షణాన్ని జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా అభివర్ణించారు. రజినీకాంత్‌ను చూడగానే ‘సుందరి’ పాట తన మనసులో ప్లే అయినట్లు, ఆ క్షణంలో తాను పూర్తిగా మరో లోకంలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు.
రజినీకాంత్‌తో కలిసి ప్రయాణించిన ఈ అనుకోని క్షణం తన రోజును ప్రత్యేకంగా మార్చిందని కాయదు లోహర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి తెరపై నటించే అవకాశం రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానంలో తీసుకున్న ఫొటోలో తాను ‘బంగాళాదుంపలా’ కనిపిస్తున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో రజినీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!