
జనరల్

తిరుమల శ్రీవారికి భక్తులు విలువైన కానుకలు సమర్పించడం కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన కమల అనే భక్తురాలు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రెండు బంగారు పగడాల హారాలను కానుకగా అందించారు. సుమారు రూ.25 లక్షల విలువైన ఈ హారాలను గురువారం శ్రీవారికి సమర్పించారు. భక్తిశ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఈ కానుకను ఆలయానికి అందజేశారు.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరికి కమల, ఆమె కుటుంబ సభ్యులు బంగారు పగడాల హారాలను అందించారు. శ్రీవారిపై తమకున్న భక్తికి గుర్తుగా ఈ విలువైన ఆభరణాలను సమర్పించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారికి భక్తులు బంగారం, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కానుకగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విరాళం కూడా ప్రత్యేకంగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!