

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం వేకువజామున ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అభివృద్ధి, పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వేద పండితులు నిర్ణయించిన 2:58 గంటల శుభ ముహూర్తంలో రూ.10 కోట్లతో చేపట్టనున్న శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి, శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ధర్మపురి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు అదనంగా రూ.80 కోట్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మొత్తంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ధర్మపురిని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.58.55 కోట్లతో మౌలిక వసతులు, ఆలయాభివృద్ధి పనులు, రూ.22.16 కోట్లతో నూతన గోదావరి పుష్కర ఘాట్లు, రూ.2.48 కోట్లతో ధర్మపురి మండలం తిమ్మాపూర్ వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!