

అయోధ్య రామమందిరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో విరాళాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠాపన తర్వాత సుమారు 15 కోట్లకు పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఫలితంగా రూ.500 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఈ నిధులను పారదర్శకంగా, సురక్షితంగా భద్రపరుస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. గణాంకాల ప్రకారం ఒక్కో భక్తి నుంచి సగటున రూ.33 కంటే ఎక్కువ విరాళం లభిస్తోంది. ప్రస్తుతం రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విరాళాలు అందుతున్నాయి. ఈ నిధుల లెక్కింపును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు అప్పగించారు.
విరాళాల దుర్వినియోగంపై ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో భాజపా ప్రతినిధి డాక్టర్ రజ్‌నీశ్ సింగ్ కేంద్ర దర్యాప్తు సంస్థలచే నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆలయంపై ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఈ విచారణ అవసరమని పేర్కొన్నారు. అవకతవకలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణల నేపథ్యంలో నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర అయోధ్యకు చేరుకుని ట్రస్ట్ సభ్యులతో నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!