
గాసిప్స్

ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పాకిస్థాన్ మరోసారి వివాదాస్పదంగా వ్యవహరించింది. ఎస్‌సీవో నేతల గ్రూప్ ఫొటోలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించకుండా ఫొటోను క్రాప్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యలో ప్రముఖంగా కనిపించేలా ఫొటోను ఎడిట్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి.
అంతేకాకుండా, ఎస్‌సీవో నేతల రౌండ్‌టేబుల్ సమావేశానికి సంబంధించిన ఓ వీడియోలో ప్రధాని మోదీ కనిపించే భాగాన్ని కూడా పాకిస్థాన్ తొలగించింది. ఈ వీడియోను షెహబాజ్ షరీఫ్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. మరోవైపు, ప్రధాని మోదీ మాత్రం ఎస్‌సీవోలోని 10 సభ్య దేశాల నేతలందరూ కనిపించే పూర్తి గ్రూప్ ఫొటోను తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. అందులో పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కూడా కనిపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!