

తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఈగల్ ఫోర్స్, ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు, దాడులు నిర్వహించి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో రూ.75 లక్షల విలువైన 150 కిలోల గంజాయిని అధికారులు పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. జడ్చర్లలో మరో ముగ్గురు గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, నాగ్‌పూర్ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ఆటో డ్రైవర్ షేక్ ఆసిఫ్ (38)ను చార్మినార్ టాస్క్‌ఫోర్స్, బండ్లగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.94 కిలోల గంజాయి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రాజస్థాన్ నుంచి నల్లమందు తీసుకొచ్చి షాపూర్‌నగర్‌లో విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!