

వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి పెద్దఎత్తున మార్పులు చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియామకం, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ నియామకం ఈ మార్పులకు ముందస్తు సంకేతాలుగా భావిస్తున్నారు.
గత రెండేళ్లుగా కీలక బాధ్యతలు లేని ప్రియాంకా గాంధీకి ఈసారి ముఖ్యమైన పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే కేసీ వేణుగోపాల్‌కు కూడా కీలక బాధ్యతలు ఇవ్వవచ్చని సమాచారం. ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి మణిక్కం ఠాకూర్‌కు కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇటీవల సమావేశమై రోడ్‌మ్యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జీల స్థాయిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది ఖర్గే అధ్యక్షుడిగా ఉండే చివరి పెద్ద పునర్వ్యవస్థీకరణగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!