

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మోదీ 3.0 పాలనలో దక్షిణ భారతదేశంలో కేంద్రం నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల వల్లే అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన అన్నారు. గత రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరిగాయని వెల్లడించారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి గత 12 ఏళ్లలో కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, సంక్షోభాల మధ్య భారత్ స్థిరంగా ఉండాలంటే ప్రధాని మోదీ సూచించిన సప్తసూత్రాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్‌లో జరిగిన రోజ్‌గార్ మేళా కార్యక్రమానికి హాజరైన ఆయన, 120 మంది అభ్యర్థులకు ఉద్యోగ అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. దేశ భవిష్యత్తుకు ప్రజల పొదుపు అలవాట్లు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!