13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రామ సభల పై రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

Writer: Priya 10:27 AM, 2 ఏప్రిల్, 2026
గ్రామ సభల పై రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

గ్రామ సభలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సభల్లో అధికారులు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయ్యాయని, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. తాము పాలకులం కాదని, సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలను కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజలు ప్రజా పాలనకు తమ ఆమోదం, మద్దతు ప్రకటించారని, ఆ ఫలితాలు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు.

ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలపై కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావాలన్నదే తమ సంకల్పమని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఉద్దేశంతోనే “ప్రజాపాలన – ప్రగతిప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలని సూచించారు. ఊరు వాడ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి పని చేయాలని, ఫైళ్లను వేగంగా క్లియర్ చేయడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని ఆయన పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం కొనసాగాలని సూచించారు.

“తెలంగాణ రైజింగ్ – 2047” విజన్‌తో రాష్ట్రాన్ని ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కోరారు. రాష్ట్రాన్ని CURE, PURE, RAREగా వర్గీకరించుకున్నామని, వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని తెలిపారు. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదని, ఇది ఒక దీక్ష అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలని, అదే తన కల అని చెప్పారు. ఆ కలను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. అందరి సహకారం కోరుతూ ఈ లేఖను ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!

ట్యాగ్లు
గ్రామసభలుతెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రజాపాలనప్రగతిప్రణాళికప్రభుత్వ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా
జనరల్

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!
ఆరోగ్యం

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు
సినిమాలు

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి
గాసిప్స్

సైమా అవార్డ్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రీతి రెడ్డి

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు
గాసిప్స్

అజిత్ రేసింగ్ ఈవెంట్‌లో విజయ్, త్రిష.. వైరల్ అవుతున్న దృశ్యాలు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?
సినిమాలు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు
సినిమాలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా
సినిమాలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ
జనరల్

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
జనరల్

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!