
జనరల్

తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వడదెబ్బ కేసులకు తక్షణ వైద్య సహాయం అందించాలని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్న ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!