

జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలను ప్రదర్శించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంతో అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ జిల్లాల అధికారులు అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఫిర్యాదు కార్యక్రమం, గ్రామస్థాయి ఆరోగ్య పరిరక్షణ చర్యలు, మహిళల ఉపాధి కార్యక్రమాలు, భూసమీకరణ ఆధారిత పట్టణ అభివృద్ధి వంటి పథకాలపై కలెక్టర్లు వివరాలు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయదగిన తొమ్మిది ఉత్తమ విధానాలను ఎంపిక చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను సంబంధిత జిల్లా కలెక్టర్లకే అప్పగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న ఆలోచనలు అవసరమని ఆయన పేర్కొన్నారు. తక్కువ వ్యయంతో మంచి ఫలితాలు సాధించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. వివాదాలు త్వరగా పరిష్కారమై ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!