

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో రూ.1,674.74 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. నగర మౌలిక సదుపాయాల విస్తరణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రూ.161 కోట్లతో సీఎంసీ ప్రధాన కార్యాలయం, రూ.530 కోట్లతో మియాపూర్ ఫ్లైఓవర్, రూ.308 కోట్లతో శేరిలింగంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు, గచ్చిబౌలి-నానక్‌రామ్‌గూడ రహదారి విస్తరణ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ సహా పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!