

హైదరాబాద్‌లోని చారిత్రక బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రం ‘అగధ’ ప్రచార జాతర ఘనంగా ప్రారంభమైంది. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌ను అజయ్ కేఆర్ సమర్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం అమ్మవార్ల సన్నిధిలో ప్రారంభించింది.
కథానాయిక కామాక్షి భాస్కర్ల సంప్రదాయ దుస్తుల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించగా, దర్శకుడు ఎం.ఎస్. రాజు, నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు, సమర్పకుడు అజయ్ కేఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్.వి.ఎన్. సుబ్బరాజు, హీరో శ్రవణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు మాట్లాడుతూ ‘అగధ’ డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, త్వరలో ట్రైలర్ విడుదల చేసి ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!