
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమల సమాఖ్య నిర్వహిస్తున్న వ్యాపార సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కూడా ఆయన భేటీ కానున్నారు.
మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం సాయంత్రం వ్యాపార సదస్సులో పాల్గొని పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!