
జనరల్

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేసింది. కొత్త విధానం ప్రకారం కౌన్సెలింగ్ మొత్తం ప్రక్రియలో ఒకసారి మాత్రమే ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సీటు అప్‌గ్రేడ్ కోరుకునే అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, ప్రొవిజనల్ అడ్మిషన్ పొందే అవకాశం కల్పించారు.
ఈ మార్పులతో విద్యార్థులు పలుమార్లు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది. తరువాతి రౌండ్‌లో మెరుగైన సీటు లభిస్తే, ముందుగా కేటాయించిన సీటు స్వయంచాలకంగా మరో అభ్యర్థికి కేటాయించబడుతుంది. తుది సీటును ఫ్రీజ్ చేసుకునే అభ్యర్థులు మాత్రమే సంబంధిత కాలేజీకి వెళ్లి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!