

బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం అంటేనే నామినేషన్స్ సందడి మొదలవుతుంది. రెండో వారం నామినేషన్స్ ప్రక్రియలోనూ కంటెస్టెంట్ల మధ్య ఉన్న విభేదాలు, మనస్పర్థలు, గ్రూప్ డైనమిక్స్ బయటపడ్డాయి. అయితే ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్‌ను కొత్త విధానంలో నిర్వహించారు. కంటెస్టెంట్లు నేరుగా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం లేకుండా.. ముందుగా టాస్క్‌లో గెలిచి నామినేషన్‌కు అర్హత సాధించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మొత్తం 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వెళ్లగా.. ముగ్గురు మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.
రోహిత్‌తో చర్చ ముగిసిన తర్వాత త్రిగుణ్ కిచెన్‌లో వంట చేస్తున్న వంశీతో హౌస్‌లోని పరిస్థితులపై మాట్లాడాడు. కొందరు కంటెస్టెంట్లు ఒక గ్రూప్‌గా మారారని, వారిలో ఒకరు ఎప్పటికీ మారరంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టాస్క్‌లు గెలవడంతో పాటు ఇంటి పనులను సక్రమంగా చేయడం ద్వారా హౌస్‌లో బలమైన స్థానాన్ని సంపాదించుకోవచ్చని వంశీకి వివరించాడు. మరుసటి రోజు ఉదయం కూడా త్రిగుణ్ ఇదే తరహా చర్చను కొనసాగించాడు. ఝాన్సీ ఇంటి పనుల్లో తగినంతగా సహాయం చేయడం లేదని వంశీతో ప్రస్తావించాడు. అలాగే గత ఎపిసోడ్‌లో నాగార్జున ఉపయోగించిన కప్పులను రోహిత్ ఇంకా శుభ్రం చేయలేదని మరోసారి చెప్పాడు. దీంతో రోహిత్ గ్లౌజులు వేసుకుని ఆ కప్పులను శుభ్రం చేశాడు. అయితే త్రిగుణ్ అవి సరిగ్గా శుభ్రం చేశాడా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తూ కనిపించాడు. ఈ చర్చలో షాలిని కూడా త్రిగుణ్‌కు మద్దతుగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!