
క్రీడలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాలకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అనవసర విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కేంద్రం తెలిపింది.
ఎబోలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టడంతో పాటు, విదేశీ ప్రయాణికులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వైరస్ లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!