
జనరల్

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ పార్లమెంట్‌లో జాతీయ పురుషుల కమిషన్ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా పురుషుల హక్కుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, విధానపరమైన సంస్కరణలపై సిఫార్సులు చేయడం, లింగ తటస్థ న్యాయం, సంక్షేమం, చట్టపరమైన రక్షణ కోసం ఒక చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
లోహగడ్ కోటలో 25 ఏళ్ల కేతన్ అగర్వాల్ హత్య కేసు నేపథ్యంలో పురుషుల రక్షణపై దేశవ్యాప్తంగా చర్చ మళ్లీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పురుషులకు ప్రత్యేక కమిషన్ అవసరమనే వాదనకు బలం చేకూరిందని బిల్లు మద్దతుదారులు పేర్కొంటున్నారు. అయితే ఈ బిల్లు అమలులోకి రావాలంటే పార్లమెంట్‌లో శాసన ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!