

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సీవీ ఆనంద్, నగరంలో పనిచేసిన ఏడాది కాలాన్ని జీవితంలో మర్చిపోలేని ప్రయాణంగా అభివర్ణించారు. చారిత్రక హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవ చేసే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ భగవత్‌కు అభినందనలు తెలియజేశారు. తన పదవీకాలంలో నగర ప్రజలు, పోలీసు సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. మత సామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణలో హైదరాబాద్ ప్రజలు చూపిన ఐక్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తన పదవీకాలంలో చేపట్టిన పలు కార్యక్రమాలను సీవీ ఆనంద్ గుర్తుచేసుకున్నారు. ఆహార కల్తీని అరికట్టేందుకు హెచ్-ఫాస్ట్, సైబర్ నేరాల నియంత్రణకు ఆపరేషన్ ఆక్టోపస్, కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో పోలీసుల పట్ల అవగాహన పెంచేందుకు డే విత్ సీపీ, మహిళల భద్రత కోసం స్పందన వాహనాలు, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎక్స్‌ట్రా మైల్, గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. తనకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ విభాగాలు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ హైదరాబాద్ ప్రజలు ఎల్లప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!