

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకం జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త పథకం అమలవుతుందని స్పష్టం చేసింది.
కొత్త పథకం అమల్లోకి వచ్చినప్పటికీ కూలీలకు పని దినాల్లో ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్రం తెలిపింది. ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద జారీ చేసిన జాబ్ కార్డులు ఈ-కేవైసీ పూర్తయి ఉంటే కొత్త కార్డులు జారీ అయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఈ-కేవైసీ పెండింగ్లో ఉన్న వారికి కూడా ఉపాధి కల్పిస్తామని తెలిపింది. గ్రామ పంచాయతీల్లో కొత్త జాబ్ కార్డుల నమోదు కొనసాగుతుందని, వేతన చెల్లింపులు, సమస్యల పరిష్కార విధానం తదితర మార్గదర్శకాలు త్వరలో విడుదల చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!