

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)పై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12వ తరగతి జవాబుపత్రాల స్కాన్డ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని డౌన్లోడ్ చేసిన తర్వాత షాక్కు గురయ్యారు. అస్పష్టంగా అక్షరాలు కనిపించకుండా ఉన్న స్కాన్డ్ కాపీలు చూసి, ఈ జవాబుపత్రాలను టీచర్లు ఎలా మూల్యాంకనం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. తాము రాసిన సమాధానాలను తామే చదవలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీ వాల్యుయేషన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ స్కాన్డ్ కాపీల స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ తప్పిదానికి పరిహారంగా ప్రతి విద్యార్థికి 15 నుంచి 20 గ్రేస్ మార్కులు ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జవాబుపత్రాల కోసం దరఖాస్తు గడువు పొడిగించినప్పటికీ, వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!