
జనరల్

నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో మరో అరెస్ట్ చేస్తూ శివరాజ్ మొటెగంకర్‌ను అదుపులోకి తీసుకుంది. ఆయన ఫోన్లో నీట్ ప్రశ్నపత్రం ఉన్నట్లు గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో పుణెలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మనీషా వాఘ్మారే పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఆమెను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ లీక్ కుట్రలో ప్రొఫెసర్ మనీషా గురునాథ్‌తో కలిసి ఆమె కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు లాతూర్‌లోని రెణుకై కెమిస్ట్రీ క్లాసెస్ ఫౌండర్ శివరాజ్ రఘునాథ్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!