

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కెనడా తన వైఖరిని మార్చుకుంటూ 1985 ఎయిరిండియా ‘కనిష్క’ విమాన పేలుడు ఘటనలో ఖలిస్థానీ ఉగ్రవాదుల పాత్రను అధికారికంగా అంగీకరించింది. 329 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దారుణ ఘటనలో ఖలిస్థానీ వేర్పాటువాదులే కారణమని భారత్ అప్పటినుంచే పేర్కొంటూ వచ్చింది. 1985 జూన్ 23న టొరంటో నుంచి ముంబయికి బయల్దేరిన ‘కనిష్క’ బోయింగ్ విమానం అట్లాంటిక్ మహాసముద్రంపై బాంబు పేలుడుతో కూలి అందులో ఉన్న వారంతా మరణించారు.
ఇటీవల కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) విడుదల చేసిన ప్రకటనలో ఈ దాడికి కెనడాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఖలిస్థానీ తీవ్రవాద గుంపులే బాధ్యులని స్పష్టం చేసింది. బబ్బర్ ఖాల్సా సంస్థ సభ్యులు విమాన లగేజీ విభాగంలో బాంబులు పెట్టి ఈ దాడిని జరిపినట్లు వెల్లడించింది. కెనడా చరిత్రలోనే అత్యంత దారుణ ఉగ్రదాడిగా ఈ ఘటనను పేర్కొంటూ, ఇంతకాలం విమర్శలకు గురైన దర్యాప్తు విధానంలో ఇప్పుడు కీలక మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!