
సినిమాలు

బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును పార్టీ మహిళా నేతలు రక్షాబంధన్ సందర్భంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ కేసీఆర్‌కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.
అనంతరం కేసీఆర్ దంపతులు గొంగిడి సునీత, తుల ఉమలను చీర, సారెతో సత్కరించి దీవించారు. రాఖీ పండుగ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఉన్న ఆత్మీయతను చాటింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!