
జనరల్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూ పెరిగానని, తెరపై హీరోగా చూసిన వ్యక్తికి ఇప్పుడు కెమెరా వెనుక నిలబడి ‘యాక్షన్’ చెప్పే అవకాశం రావడం తనకు ఇప్పటికీ కలలా అనిపిస్తోందని పేర్కొన్నారు. పవన్ స్టైల్, ఎనర్జీ, ప్రత్యేకతలను కోట్లాది మంది అభిమానులతో కలిసి తాను కూడా ఆస్వాదించానని తెలిపారు.
తనకు పవన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం జీవితంలో ప్రత్యేకమైన మలుపుగా సుజీత్ అభివర్ణించారు. తొలుత తన హీరోగా అభిమానించిన పవన్.. ఇప్పుడు తన ‘ఓజీ’గా మారారని భావోద్వేగంగా పేర్కొన్నారు. అలాగే ‘ఓజీ యూనివర్స్’ నుంచి సాయంత్రం 4:05 గంటలకు చిన్న ట్రీట్ ఉంటుందని వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!