
టెక్నాలజీ

బిహార్‌లో దెబ్బతిన్న ఒక వంతెన మరమ్మతులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇతర రాష్ట్రాల్లో వంతెనలు నిర్మిస్తే బిహార్‌లో మాత్రం వాటిని కుట్టేస్తారంటూ నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇనుప తీగలు, తాత్కాలిక ఏర్పాట్లతో వంతెనను మరమ్మతు చేస్తున్న దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవల బిహార్‌లో వరుసగా వంతెనలు కూలిన ఘటనల నేపథ్యంలో నిర్మాణ నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పనితీరు, మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పోస్టు ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!