

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలక సమావేశాలు సానుకూల ఫలితాలు ఇచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మనోహర్‌లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ, నిధుల సమీకరణ అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించనున్నారు.
మెట్రో ప్రాజెక్టు ఆలస్యం, కోవిడ్ ప్రభావం కారణంగా ఎల్‌అండ్‌టీ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-1ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేసింది. తక్కువ వడ్డీతో రుణాల సమీకరణ, ఫేజ్-2 నిర్మాణం, నిర్వహణపై కూడా చర్చలు జరిగాయి. ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!