
రాజకీయాలు

భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషంగా మారింది. ఇది ఓటింగ్ విధానంలో కీలక మార్పును సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాల్లో ముస్లిం ఓట్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
అయితే దక్షిణ బెంగాల్, కూచ్ బీహార్ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భారత ఎన్నికల సంఘం డేటా ప్రకారం బీజేపీ 32 స్థానాల్లో, టీఎంసీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇదే సమయంలో అసోం, పుదుచ్చేరిలో బీజేపీ ఇప్పటికే మెజార్టీ మార్క్‌ను దాటి తన బలం చాటుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!