

భారత సైన్యంలో మేజర్ నవ్య శేఖావత్ కీలక ఘనత సాధించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎయిడ్-డి-క్యాంప్ (ఏడీసీ)గా నియమితులైన తొలి మహిళా ఆర్మీ అధికారిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ పదవిని చేపట్టిన రెండో మహిళా సైనిక అధికారిగా కూడా ఆమె నిలిచారు. అంతకుముందు 2025లో భారత నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ యశస్వి సోలంకి రాష్ట్రపతికి తొలి మహిళా ఏడీసీగా బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్రపతి ఏడీసీలు అధికారిక కార్యక్రమాలు, వేడుకలు, పర్యటనలు, సైనిక మరియు లాంఛనప్రాయ ప్రోటోకాల్‌కు సంబంధించిన బాధ్యతల్లో రాష్ట్రపతికి సహకరిస్తారు. మేజర్ నవ్య శేఖావత్ 2021లో యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ పరీక్ష ద్వారా ఎంపికై, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ అనంతరం ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో చేరారు. సుమారు ఐదేళ్ల సైనిక సేవలోనే మేజర్ హోదాకు చేరుకున్న ఆమెకు ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌లో కీలక బాధ్యతలు అప్పగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!