

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. ఫ్లెక్సీల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫొటోలు లేకపోవడంపై కొందరు బీఆర్‌ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసి, సుచిత్ర, చింతల్, జీడిమెట్ల, ఐడీపీఎల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను చించివేశారు.
ఈ ఘటనపై ప్రీతిరెడ్డి స్పందిస్తూ.. తన పుట్టినరోజు వేడుక పార్టీ కార్యక్రమం కాదని తెలిపారు. రాజకీయ కార్యక్రమం అయితే పార్టీ ప్రొటోకాల్ ప్రకారం ముఖ్య నేతల ఫొటోలను ఏర్పాటు చేసేవారమని చెప్పారు. తనపై ఉన్న అభిమానంతో కాలేజీ, ఆస్పత్రి సిబ్బంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కొందరు ఫ్లెక్సీలను చించివేసినా తన మనోబలాన్ని, ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానాన్ని చించలేరని వ్యాఖ్యానించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!