
టెక్నాలజీ

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని బెదిరింపులు వచ్చినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ఆరోపించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని చెప్పుకున్న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి రూ.7 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను చంపేస్తామని వాట్సాప్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపినట్లు తెలిపారు.
ఈ ఘటనపై నవంబర్ 6న జర్నైల్ సింగ్ మొహాలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వచ్చిన ఈ బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనే విషయం, బెదిరింపుల వెనుక ఉన్న కారణాలు, పోలీసుల తదుపరి చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!