
సినిమాలు

ఏపీ పాలీసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి పరీక్షలకు మొత్తం 1,77,581 మంది నమోదు చేసుకోగా, 1,63,008 మంది హాజరయ్యారు. వీరిలో 1,48,950 మంది ఉత్తీర్ణులై 91.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన హాజరు మరియు ఉత్తీర్ణతగా నిలిచింది.
ఈసారి అమ్మాయిలు 93.57 శాతం ఉత్తీర్ణతతో అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించారు. గిరిజన ప్రాంతాలైన అల్లూరి సీతారామ రాజు, పోలవరం, పార్వతీపురం మన్యం జిల్లాలు కూడా మంచి ఫలితాలు సాధించాయి. విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, మిగిలిన వారు మరింత శ్రమించాలని అధికారులు సూచించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!