
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో మొత్తం 1,534 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 378 సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టులు, 1,156 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 31న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 28న రాత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!