
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ 2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EAPCET లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే 9552300009 వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 1,82,317 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాల్లో 63,546 మంది అర్హత సాధించారు.
ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 71.65 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థినులు విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. వారి విజయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమని అభినందిస్తూ, ర్యాంకుల ఆధారంగా త్వరలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు సిద్ధం కావాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!